Header Banner

రైలు హైజాక్! ఆరుగురు సైనికుల హత్య, వందల మంది బందీ!

  Tue Mar 11, 2025 19:05        Others

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో వేర్పాటువాదులు ఘోర దాడికి తెగబడ్డారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మిలిటెంట్లు కాల్పులతో దాడి చేశారు. రైల్వే ట్రాక్‌ను పేల్చి రైలును నిలిపివేసిన అనంతరం, వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మిలటరీ సిబ్బందిని హత్య చేసినట్టు BLA ప్రకటించింది. బందీలను విడుదల చేయాలంటే తమపై మిలటరీ చర్యలు తీసుకోకూడదని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

 

ఇది కూడా చదవండి: వర్రా రవీందర్ రెడ్డి కొత్త టూర్ ప్లాన్! కేసులు పెరుగుతాయి కానీ క్షేమంగా ఉంటాడు!

 

ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టాయి. BLA బలోచిస్థాన్‌ ప్రజలకు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుతూ 2000లో ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి పలు హింసాత్మక దాడులకు పాల్పడినందున పాకిస్థాన్, అమెరికా, యూకే దేశాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ప్రస్తుతం జరిగిన దాడి దేశ భద్రతకు పెనుముప్పుగా మారడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #BalochistanAttack #TerroristAttack #PakistanRailAttack #BLAAttack #TrainHijack